హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు

JGL: బీర్పూర్‌ మండలంలో విద్యుత్‌ సరఫరా అంతరాయాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఇవాళ విమర్శలు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, కనీసం 7 గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందించలేకపోతోందని ఆరోపించారు. రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.