హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి: ఎమ్మెల్యే

NLG: నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ రైతులకు సూచించారు. గురువారం చింతపల్లి రైతువేదికలో వ్యవసాయ శాఖ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్తుల్లో ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు.