హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కలెక్టర్ ఆదేశం

VKB: భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా గోధుమగూడలో చేపట్టిన ఇంకుడు గుంతలు, బోర్ రీఛార్జ్ పనులను కలెక్టర్ దీపక్ పరిశీలించారు. వర్షపు నీటిని భూగర్భంలోకి మళ్లించే పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో DTRDO శ్రీనివాస్, MPDO వినయ్ పాల్గొన్నారు.