BDK: అశ్వాపురం మండలంలో లిటిల్ కాజ్ ఎన్జీవో, రూపాయి ఫౌండేషన్ సహకారంతో సామూహిక వివాహాలకు ఎంపికైన 50 జంటల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నవంబర్ 18న హైదరాబాద్లో నిర్వహించనున్న వివాహాలకు సంబంధించిన ఏర్పాట్లు, అవసరమైన పత్రాలపై ఎన్జీవో డైరెక్టర్ నిదానపల్లి ప్రసాద్ అవగాహన కల్పించారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
తెలంగాణ
సామూహిక వివాహాలకు 50 జంటల రిజిస్ట్రేషన్


