హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగుల నిరసన మూడో రోజుకు!

గద్వాల పాత బస్టాండులో NHM, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన మూడో రోజుకు చేరింది. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను క్రమబద్ధీకరించాలని, 100 శాతం వేతనాలు, ప్రతినెల 5న జీతాలు, 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.