హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పోటీలు ప్రారంభించిన మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను గురువారం మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. కరాటేతో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.