KMM: చింతకాని మండలం కొదుమూరులో AIKS సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పెట్టుబడులు పెట్టినా పంటలు చేతికందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'


