HYD: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను ఏటీఎంలా ఉపయోగించుకున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో కొందరి కమిషన్లకు అడ్డుకట్ట పడిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసేలా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నారు: మంత్రి


