KMM: మధిర మండలంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మధిర రూరల్ ఎస్సై విశ్వతేజ సూచించారు. గురువారం ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, మైకుల శబ్దంతో ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని స్పష్టం చేశారు. రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
ఉత్సవాల్లో ట్రాఫిక్కు ఆటంకం కలగొద్దు: ఎస్సై


