BDK: కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, మెడికల్ ఆఫీసర్ రవి విధులకు అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. దీనిపై ఛార్జ్ మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పొంతనలేని సమాధానాలపై అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అవుట్సోర్సింగ్ GNMలను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మెడికల్ ఆఫీసర్ తీరుపై కలెక్టర్ ఆగ్రహం


