హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు : మేయర్ శ్రీనివాస్

KNR: బొమ్మకల్‌లో బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం బొమ్మకల్‌లో నిమజ్జన ఘాట్‌లు, బతుకమ్మ ఆడే ప్రాంతాలను డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల వెంకటేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.