హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవు

KMM: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో వారాంతపు సెలవులు, 19న దుర్గాష్టమి, 20, 21 తేదీల్లో విజయదశమి సందర్భంగా మార్కెట్‌కు సెలవులు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 22 నుంచి మార్కెట్‌లో పంటల క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.