హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుర్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంప్రారంభం

BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గురువారం ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు నూతన కార్యాలయం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు.