HYD: కవాడిగూడాలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (UPHC) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అత్యవసర వైద్య పరికరాలు, రోగుల సంరక్షణకు అవసరమైన సదుపాయాలను అందజేశారు. స్థానికంగా వైద్య సేవలను బలోపేతం చేయడం, రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఈ పరికరాలను పంపిణీ చేశారు. వీటితో నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణ
కవాడిగూడా UPHCకి కేంద్రమంత్రి సాయం


