AKP: ఎలక్షన్ నామినేషన్ల నేపథ్యంలో నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ఎల్. రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యాలయం వద్ద ఎన్నికల డీటీ, ఆర్ఐ, వీఆర్వో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు


