హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశాఖ మేయర్ పీఠం స్థానికులకే దక్కాలి'

విశాఖ మేయర్ పీఠం స్థానికులకే దక్కాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ డిమాండ్ చేశారు. గురువారం విజయనగరంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నేతకే మేయర్ పదవి ఇవ్వాలని, స్థానికేతరులకు కేటాయిస్తే ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓడిస్తామని హెచ్చరించారు.