హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థికి MBBS సీటు

ASF: బెజ్జూర్ మండలం, బారేగూడకి చెందిన డోకే మహేష్‌కు MBBS సీటు లభించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుంచి పట్టుదలతో చదువుతూ వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో అడుగుపెట్టడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.