హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీటీసీ కుమారున్ని పరామర్శించిన పిన్నెల్లి

PLD:​ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్‌లోని రవితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ కేతావత్ శీను నాయక్ కుమారుడు మణి నాయక్‌ను మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు.