హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతానలక్ష్మి అలంకారంలో కనకమహాలక్ష్మి

VSP: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం కనకమహాలక్ష్మీ అమ్మవారు సంతానలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కలువ పూల అలంకరణతో సహస్రనామార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో కె. శోభారాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పరిశీలించారు.