KRISHNA: రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గురువారం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనల నేపథ్యంలో మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో వర్ష సూచనలు


