హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురికి కాలువలో పసికందు మృతదేహం

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడులో గురువారం మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.