హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ధనలక్ష్మిగా, రేపు సరస్వతిగా అమ్మవారు

PLD: రొంపిచర్ల వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిస్తుండగా, సాయంత్రం కుంకుమార్చన పూజలు ఉంటాయి. రేపు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే కుంకుమార్చనలో భక్తులు, విద్యార్థులు పాల్గొనాలని ధర్మకర్త మద్ది రామచంద్రరావు కోరారు.