హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సావనీర్ ఆవిష్కరించిన యల్లటూరు

అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మండల ప్రాథమిక పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన శతాబ్ది సావనీర్‌లు గురువారం రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. ఇదే పాఠశాలలో తాను చదువుకున్నానని, ఉపాధ్యాయులు నేర్పిన విద్య, క్రమశిక్షణ తన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.