హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ లింక్డిన్ పోస్ట్‌పై సత్య నాదెళ్ల కామెంట్స్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే లింక్డిన్‌లో తన తొలి పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ పోస్ట్‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. 'నా లింక్డిన్ ఫీడ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. లింక్డిన్‌లోకి స్వాగతం విరాట్. One8World ద్వారా మీరు ప్రారంభించబోయే వ్యాపార ప్రయాణానికి నా అభినందనలు' అంటూ సత్య నాదెళ్ల పోస్టు పెట్టారు.