భోజనం తర్వాత తీపి పదార్థాలు తినే అలవాటు ఉంటే జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం ముగిశాక స్వీట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి, డయాబెటిస్, జీర్ణసమస్యలకు దారితీస్తుంది. స్వీట్స్ తినాలనిపిస్తే భోజనానికి ముందే లేదా తిన్న రెండు గంటల తర్వాత తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
జాగ్రత్త.. భోజనం తర్వాత స్వీట్స్ తింటున్నారా?


