హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా రాజలింగం

MNCL: తెలంగాణ ఉద్యమకారుల వేదిక కళాకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా జన్నారం మండలానికి చెందిన ఉద్యమ కళాకారుడు లింగంపల్లి రాజలింగం నియమితులయ్యారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రాజలింగం ఇప్పటికే కళాకారుల విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.