హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా సహకరించాలి. సీఐ

VZM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, నగదు ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని సీఐ టి.వి. విజయకుమార్ గురువారం విలేకరుల సమావేశంలో సూచించారు. ఎన్నికలకు విఘాతం కలిగించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.