హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుకు గ్రహణం

ASF: కాగజ్‌నగర్ ప్రాంతంలోని జగన్నాథ్‌పూర్ (పెద్దవాగు) ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉంది. 2006లో రూ.124.64 కోట్లతో మంజూరైన పనుల వ్యయం రూ.250 కోట్లకు చేరింది. రూ.185 కోట్లతో 85 శాతం పనులు పూర్తయినా కాల్వలు, 80 ఎకరాల భూసేకరణ పెండింగ్. వరద నీరు ప్రాణహితలో వృథాగా కలుస్తోంది. రూ.10 కోట్లు ఇవ్వాలన్న నివేదికకు స్పందన లేదు. 15 వేల ఎకరాల రైతులు వర్షాలపైనే ఆధారపడుతున్నారు.