హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

BPT: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రి చీరాల పట్టణంలో వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, గుంపులుగా చేరడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అల్లర్లు సృష్టించడం వంటివి చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.