హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పసరు వైైద్యంతో చిన్నారికి ప్రాణపాయం

PPM: బిత్తరటొంకి గిరిజన గ్రామానికి చెందిన చిన్నారి రోజాకు జలుబు, దగ్గు రావడంతో కుటుంబీకులు పసరు మందులు తాగించారు. అది వికటించి బాలిక అపస్మారక స్థితికి చేరింది.  బుధవారం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లల వైద్యులు పరీక్షించి పసరు పట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని గుర్తించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.