హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సకాలంలో వాయిదాలు చెల్లించినా జరిమానా.. బ్యాంకుకు షాక్‌

VSP: విశాఖపట్నంలో రుణ వాయిదాలు సకాలంలో చెల్లించినా అపరాధ రుసుం వసూలు చేయడాన్ని వినియోగదారుల ఫోరం సేవాలోపంగా గుర్తించింది. న్యాయవాది బీవీఎస్‌ గణేశ్‌ ఫిర్యాదుపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. వసూలు చేసిన రూ.16,080 తిరిగి చెల్లించాలని, రూ.50 వేల పరిహారం, రూ.10 వేలు కోర్టు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.