హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కోసం మహిళల అవస్థలు.. స్పందించని అధికారులు

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్‌ గ్రామంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో నాలుగు రోజులుగా తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. మహిళలు బిందెలతో నిరీక్షించాల్సి వస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, సర్పంచ్‌ అంజయ్య ట్రాక్టర్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.