HYD: బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను కనిపించిన ఘటన మాదాపూర్లో వెలుగు చూసింది. చందానగర్కు చెందిన శ్యాంప్రసాద్ తన స్నేహితుడుతో కలిసి నిన్న మాదాపూర్లోని 'ది జాయింట్ ఆల్ మండి రెస్టారెంట్' కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా ఏదో గట్టిగా తగలడంతో తీసి చూడగా.. పుచ్చిపోయిన పన్ను కనిపించింది. దీంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వాపోయాడు.
తెలంగాణ
బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను.. షాక్లో కస్టమర్!


