మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి సర్వే నంబర్ 226లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగ కేంద్రం ఏర్పాటు కానుంది. రూ.12 కోట్ల వ్యయంతో రోజుకు 200 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
తెలంగాణ
రాంపల్లిలో రూ.12 కోట్లతో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్


