NLG: భర్త పెద్దకర్మ రోజే భార్య మృతి చెందడం చండూరు మండలంలో విషాదాన్ని నింపింది. పుల్లెంల గ్రామానికి చెందిన మొగుదాల పెంటయ్య ఇటీవల మృతి చెందారు. ఇవాళ ఆయన పెద్దకర్మ నిర్వహించాల్సి ఉండగా అతని భార్య మొగుదాల సాలమ్మ కూడా కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరణంలోనూ విడదీయని దంపతుల బంధాన్ని తలచుకుని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ
భర్త పెద్దకర్మ రోజే భార్య మృతి..!


