హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేతకి సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు

SRD: జిల్లాలో ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీకేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్వయుజ మాస పంచమిని పురస్కరించుకుని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం, మహా మంగళ హారతి, నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.