PDPL: పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు పట్టుకొని తనిఖీ చేశారు. అతడి వద్ద 64.85 గ్రాముల గంజాయి లభించినట్లు రూరల్ ఎస్సై మధుకర్ తెలిపారు. నిందితుడిని భోజన్నపేటకు చెందిన జక్కుల అరుణ్గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత


