హైదరాబాద్: 28°C
తెలంగాణ

28 పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు

సిద్దిపేట జిల్లాలోని 28 ప్రభుత్వ బడుల్లో కొత్తగా గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. విద్యార్థులకు లైబ్రరీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రూ.7.56 లక్షల నిధులు విడుదల చేసిందన్నారు. మంజూరైన నిధులతో త్వరలోనే గ్రంథాలయాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.