KMR: బిచ్కుంద మినీ ట్యాంక్బండ్లోని కమ్మరి చెరువులో పడి నిఖిల్ (35) మృతి చెందాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిఖిల్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. బుధవారం అమరవీరుల స్థూపం సమీపంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య పత్తి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
కమ్మరి చెరువులో పడి వ్యక్తి మృతి..!


