హైదరాబాద్: 28°C
తెలంగాణ

రసీదులు లేని మద్యం బాటిళ్లు స్వాధీనం

KMR: కిష్టాపూర్ వద్ద బుధవారం రాత్రి ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కారును తనిఖీ చేయగా, ఇతర రాష్ట్రాల నుంచి రసీదులు లేకుండా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బానాపూర్ తండాకు చెందిన వ్యక్తిని పట్టుకుని, మద్యాన్ని బాన్సువాడ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.