WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ప్రియాంక బుధవారం తెలిపారు. 17న యార్డు బంద్,18న వారాంతపు సెలవు,19 నుంచి 21వరకు విజయదశమి సందర్భంగా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 22న మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని, రైతులు సెలవు రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని సూచించారు.
తెలంగాణ
ఏనుమాముల మార్కెట్కు ఐదు రోజులు సెలవులు


