హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినులు ఎంపిక

NZB: ఆలూరు మండలం మిర్ధపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఈ. నిత్య, బి. రమ్య రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత, సర్పంచ్‌ యల్లా సాయిరెడ్డి, విడిసి సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.