హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రబీ సాగు విస్తీర్ణం పెంచాలి'

VZM: రబీ 2026–27 సీజన్‌లో సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు. బుధవారం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతోపాటు ఈ-పంట నమోదు, పంటల నష్టం నమోదు తదితర అంశాలపై అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు.