హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు మహిళల హక్కలపై అవగాహన

ప్రకాశం: సింగరాయకొండ పరిధిలోని ఆల్ఫా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో శ్రింప్ సినర్జీ ప్రాజెక్టులో భాగంగా కార్మికులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేద మహిళలకు న్యాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. మహిళా కార్మికులు తమ హక్కులు, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.