TPT: వెంకటగిరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్టమైన భద్రత, అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు. బుధవారం రెండు పట్టణాల్లోని స్ట్రాంగ్ రూమ్లు, పంపిణీ, స్వీకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆర్డీఓలతో కలిసి పరిశీలించారు. ఎన్నికల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి, పుత్తూరు ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన


