హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

KDP: చెన్నూరులోని శ్రీశ్రీశ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో నిర్వహిస్తున్న 97వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిని దేవస్థాన అధ్యక్షుడు అల్లి రామమూర్తి, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు.