హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిలిచిన అల్లూరు నగర పంచాయతీ ఎన్నిక..!

NLR: అల్లూరు, సింగపేట, మోపూరు పంచాయతీలను కలిపి అల్లూరు నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు. కొందరు నగర పంచాయతీ వద్దంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసులు తదితర కారణాల వలన అల్లూరు నగర పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అధికారులు బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.