ASR: రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కె. షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ప్రజల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గంజాయి వినియోగం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజే ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై


