తూ.గో: గోకవరం మండల కేంద్రంలో బుధవారం జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసైనికులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి'


