హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం'

ASR: హుకుంపేట మండలం కొంతిలిలో బుధవారం వైసీపీ బూత్ కమిటీల బలోపేతం, ఐడీ కార్డుల పంపిణీపై సమావేశం నిర్వహించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. మూడు గ్యాస్ సిలిండర్లు సహా ఎన్నికల హామీలు అమలు చేయలేదని, పెన్షన్లు, అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గించారని ఎమ్మెల్యే ఆరోపించారు.